కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…
నరసన్నపల్లి సర్పంచ్ రసమోల్ల రవి సహా 20 మంది చేరిక..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 5 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ సర్పంచ్ రసమోల్ల రవి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆలే శ్రీకాంత్, రసమోల్ల భూమయ్య, చందన స్వామి, చందన చంద్రం, రసమోల్ల రాజయ్య, ధ్యాప చిన్న అంజయ్య, పిట్టల నర్సింలు, ఆలే రాజయ్య, రసమోల్ల స్వామి, ధ్యాప రవి తదితరులు సహా సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు,
రాష్ట్ర యువజన నాయకులు మహమ్మద్ ఇలియాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజా గౌడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, యువజన కాంగ్రెస్ నాయకులు హనుమాన్ల, రామ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, రెడ్డి నాయక్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


