కామారెడ్డిలో కాంగ్రెస్‌లోకి భారీగా యువత చేరికలు..

కామారెడ్డిలో కాంగ్రెస్‌లోకి భారీగా యువత చేరికలు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 5 (అఖండ భూమి న్యూస్);

బీఆర్ఎస్, బీజేపీ నుంచి 70 మంది యువకులకు కాంగ్రెస్ కండువా కప్పిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పార్టీలోకి ఆహ్వానించారు.

కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు యువ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాణాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 40 మంది, బీజేపీ నుంచి వంశి యాదవ్, భాను యాదవ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా శివకుమార్, నిఖిల్, సాయిరాజ్, నీరజ్, విష్ణు, కన్నా, సాయి, లక్ష్మణ్, శ్రీశాంత్, అనురాగ్, అబ్భు, రామ్ యాదవ్, నిక్కి రాయి, కౌశిక్, ప్రభాస్, ప్రశాంత్, కళ్యాణ్, సతీష్, గణేష్, పండు, శ్రీ సాయి, నందు, రాము, భాను తదితరులు సహా మొత్తం 70 మంది యువకులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి అనేక ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం పనితీరును చూసి యువత స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా పాలన సాగలేదని, అనేక వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణను వెనక్కి నెట్టారని ఆరోపించారు.

అదే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల అసలు సమస్యలైన నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల ఇబ్బందులను పక్కనపెట్టి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ముఖ్యంగా యువతను మతాలు, కులాల పేరుతో రెచ్చగొట్టి వారి శక్తిని, భవిష్యత్తును దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ యువతకు అవసరమైన ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, విద్యా అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి, సామాజిక న్యాయం, లౌకిక విలువల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని షబ్బీర్ అలీ తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి యువకుడికి సముచిత గుర్తింపు లభిస్తుందని, ప్రజాసేవలో వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు,

రాష్ట్ర యువజన నాయకులు మహమ్మద్ ఇలియాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజా గౌడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, ఇప్ప శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు హనుమాన్ల, రామ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, రెడ్డి నాయక్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!