తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్…

*తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్…

*తల సేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడినందుకు అవార్డు అందజేస్తున్న బాలు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 120 యూనిట్ల రక్తాన్ని సేకరించిన వాసవి క్లబ్ బీబీపేట్ కు తల సేమియా లైఫ్ సేవర్ అవార్డు 2026 ను ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అమ్మద్ లు అందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు,జమీల్ అహ్మద్ లు మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న కోసం 2025 వ సంవత్సరంలో 120 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాసవి క్లబ్ లలో మొదటి స్థానంలో నిలిచిన వాసవి క్లబ్ బీబీపేట్ కు తల సేమియా లైఫ్ సేవర్ అవార్డును అందజేయడం జరిగిందని,తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు జీవితాంతం రక్తం అవసరమని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ముందుకు వచ్చిన వాసవి క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి సంవత్సరం ఒక రక్తదాన శిబిరాన్ని చిన్నారుల కోసం నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా దానికి సానుకూలంగా స్పందించి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు 6000 యూనిట్లకు పైగా రక్తాన్ని తలసేమియా బాధిత చిన్నారుల కోసం సేకరించడం జరిగిందని అన్నారు.రక్తదాన శిబిరాలను నిర్వహణకు యువజన సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పర్ష వెంకటరమణ,వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి శ్రీనివాస్,వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్,జోనె చైర్మన్ తడుపునూరి నాగభూషణం,విశ్వ మోహన్,నంగునూరి చంద్ర శేఖర్,బచ్చు రామచందం, నీల బైరయ్య,రెడ్డి శెట్టి వెంకటేశం,పెద్ది నాగయ్య, ఇల్లందులో ఆంజనేయులు, తొడుపునూరి శ్రీనివాస్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!