ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం.. ఇద్దరు మృతి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్ బారినపడి మంగళవారం మృతి చెందారు.
మృతుల్లో ఒకరికి 43 ఏళ్లు, మరొకరికి 60 ఏళ్లుపైనే ఉన్నాయని తెలిసింది.
మృతులిద్దరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో తదుపరి నిర్ధారణ పరీక్ష కోసం వారి బ్లడ్ శాంపిళ్లను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపడానికి కడప జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృత్యువాత పడగా.. 60 ఏళ్లు పైబడిన వ్యక్తి తమిళనాడులోని సీఎంసీ వెల్లూరులో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


