జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద నిరసన…

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద నిరసన…

*అక్రిడిటేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి..

*ఆల్ ఇండియా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏ ఎల్ జె పి ఎఫ్)..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి;, జూలై 13: (అఖండ భూమి న్యూస్);

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అర్హులైన ప్రతి పాత్రికేయుడికి వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఇంటి స్థలాలు కేటాయించి హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ జిల్లా అధ్యక్షులు డి.ఎల్.ఎన్. చారి.కామారెడ్డి కన్వీనర్ గర్దాస్ చంద్ర శేఖర్,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డి.ఎల్.ఎన్. చారి మాట్లాడుతూ ,రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు సంక్షేమ పథకాలు అందించి, అర్హులైన సీనియర్ జర్నలిస్ట్ లకు 15 వేలు పెన్షన్ పథకం,హెల్త్ కార్డుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల హక్కులు, గౌరవం, భద్రత, సంక్షేమ పరిరక్షణ కోసం ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జర్నలిస్టుకు ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “జర్నలిస్టుల ఐక్యతే మా బలం… హక్కుల సాధనే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చి ధర్నాకు మద్దతు తెలిపిన జర్నలిస్టులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని డి.ఎల్.ఎన్. చారి ఆరోపించారు. జర్నలిజంతో సంబంధం లేని వ్యక్తులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసి నిజమైన పాత్రికేయులకు అన్యాయం చేశారని విమర్శించారు.

ఇప్పటివరకు అక్రిడిటేషన్ కార్డులు పొందిన వారందరి పూర్తి జాబితాను బహిరంగంగా విడుదల చేయాలని, మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!