విద్యార్థుల ప్రతిభను గుర్తించి నగదు ప్రోత్సాహం ఇవ్వడం అభినందనీయం…
*ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి..
*బాలికలు చదువుతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలి..
*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
దోమకొండ మండల కేంద్రంలోని పీఎం హెచ్ ఎస్ హెచ్ ఆర్ ఐ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో గత సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శ్రీరామ్ చిట్స్ వారు నిర్వహించిన నగదు బహుమతుల ప్రదానోత్సవం, సన్మాన కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొనీ విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యార్థినుల ప్రతిభను గుర్తించి నగదు బహుమతి ఇవ్వడం సంతోషం అని, ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయనీ, వాటిని సరిగ్గా వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని,
ముఖ్యంగా బాలికలు చదువుతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


