అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 14 (అఖండ భూమి న్యూస్);
అట్టడుగు వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో భారత షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాతీయ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ. సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, ఆర్థిక సాధికారత, సామాజిక న్యాయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు, పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై అధికారులకు వివరించారు.
సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎస్సీ వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరింత కట్టుబడి పనిచేస్తుందని సమావేశంలో నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
You may also like
విద్యార్థులు సైన్స్‌పై పరిశోధనా దృక్పథం పెంపొందించుకోవాలి…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి…
శ్రీ కాలభైరవ స్వామిని ప్రత్యేకంగా దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
ఎల్లారెడ్డి బావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం…
విద్యార్థుల ప్రతిభను గుర్తించి నగదు ప్రోత్సాహం ఇవ్వడం అభినందనీయం…


