కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి…

జూలై 15న హైదరాబాదులో జరిగే *నిరుద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలి..

యువతకు సీపీఎం పిలుపు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 14 (అఖండ భూమి న్యూస్);

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జులై 15న హైదరాబాద్ లో జరిగే నిరుద్యోగుల మహా ధర్నాకు కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో నిరుద్యోగులతో కలిసి మహా ధర్నా కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని,నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు పరచకపోగా, తమ వయో పరిమితి మించిపోతోందని నోటిఫికేషన్లు విడుదల చేయాలని పోరాటం చేస్తున్న నిరుద్యోగుల ఉద్యమాలను అణచివేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే మాట దాటవేస్తున్నారని విమర్శించారు.ఖాళీల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోకుండా, అసత్య ప్రకటనలు,మోసపూరిత హామీలతో నిరుద్యోగులను ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇల్లు పొలాలు స్థలాలు తాకట్టుపెట్టి సంవత్సరాల తరబడి విలువైన శ్రమను, కాలాన్ని డబ్బును వెచ్చించే నిరుద్యోగులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు రాక సంవత్సరాల తరబడి నిరుద్యోగులు గ్రంధాలయాల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలను పోటీ పరీక్షల కోసం ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి భర్తీ చేయాలని, డీఎస్సీ,గ్రూప్1,2,3,4లతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంతవరకు నిరుద్యోగులు అందరికీ నెలకు 5000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేకుండా వివాదాస్పదమైన జీవోలను తొలగించి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులన్నింటినీ తక్షణమే భర్త చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీ న

హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే నిరుద్యోగుల మహా ధర్నా కు జిల్లాలోని అన్ని మండలాల నుండి యువత హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వెంకట్ గౌడ్ మూతిరం కొత్త నరసింహులు జిల్లా కమిటీ సభ్యులు బుధవారం అరుణ్ కుమార్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!