శ్రీ కాలభైరవ స్వామిని ప్రత్యేకంగా దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

శ్రీ కాలభైరవ స్వామిని ప్రత్యేకంగా దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 14:(అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ కాలభైరవ స్వామి దేవాలయాన్ని (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ప్రత్యేకంగా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

అనంతరం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని శ్రీ కాలభైరవ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తి, సంకల్పం ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు,పంపరి లక్ష్మణ్,సబ్బాని హరికృష్ణ,డిసిసి జనరల్ సెక్రెటరీ, జూలూరు సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు,గడ్డమీది మహేష్,రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్,తాటి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్,చాట్ల వంశీ,పిడుగు సాయిబాబా, చింతల రవేందర్ గౌడ్, సేవాదళ్ యూత్ అధ్యక్షులు నర్సల్లా మహేష్, యూత్ నాయకులు,బండారి శ్రీకాంత్, మెహర్ బాబా గౌడ్, గంగారం, అరుణ్, రాహుల్ ఆకాష్, రమేష్,ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!