రైతుల పంటల సరపరలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం…

రైతుల పంటల సరపరలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం…

పంటలు ఎండుతున్న పట్టించుకోని ప్రభుత్వం..

రైతులను గోసపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..

జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విలేకరుల సమావేశం..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 15 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్రంలో రైతు పంటలకు విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు.

నిన్న ముఖ్యమంత్రి ఇంకా అధికారులు మారరా అని బెదిరిస్తూ… ఓ అధికారిని సస్పెండ్ చేశాడు అని అన్నారు.

నీ ప్రభుత్వం వైఫల్యం…అధికారుల మీద తోస్తవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.

ఇండస్ట్రీస్ కు 24 గంటల కరెంట్ ఇస్తూ, రైతుల పంటలను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు. ప్రజలకు తప్పుడు వాగ్దానాలతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతుల గోస పట్టదా అని గుర్తు చేశారు.

ఏలినిలో అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉంది. కేవలం తెలంగాణలో లేదు అన్నారు. కరువు పరిస్థితులను సృష్టిస్తూ విద్యుత్ కోత పంటలు చేతికి వచ్చే సమయంలో అప్రకటిత విద్యుత్ కోతతో పంటలు ఎండిపోతున్న రైతన్న గోడును పట్టించుకోకుండా కోతలు విధించడంపై ప్రభుత్వ వైఖరి పై దుయ్యబట్టారు.

ఏలి నీపై ముందస్తుగా ముఖ్యమంత్రింగ్ నీ ప్రణాళిక ఏముంది అని అన్నారు.

నిన్ను ఆదిలాబాద్ లో రైతులు అర్ధ నగ్నంగా ఉండి తల క్రిందిలుగా నిరసన తెలిపిన పట్టించుకోకుండా తన తప్పు ఏమి లేదని అధికారులపై వేటు వేయడం ఎంతవరకు సభాపతి అన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని పుష్కలంగా నీరు, కరెంట్ ను ఇచ్చింది బి ఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు.

భద్రాద్రి, యాదాద్రి లో తర్మాల్ స్టేషన్ కెసిఆర్ ఏర్పాటు చేయలేదా అని అన్నారు.

మాచారెడ్డి లో ఒక రైతు 15 రోజుల్లో చేతికి వచ్చే పంటను కాపాడుకోవడానికి జెనరేట్ పెట్టుకొని పంటను పండిస్తున్నాడు.

గ్రామాల్లో 6,7 గంటల కంటే కరెంటు రావడం లేదు అని గుర్తు చేశారు.

ఇంత చేతగాని ముఖ్యమంత్రి,

40 లక్షలు మెట్రిక్ టన్నుల బొగ్గు రికార్డ్ లేకుండా బయటకు పోయిందని దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

స్వయంగా రైతులే సబ్ స్టేషన్ ల దగ్గరకు వచ్చి ధర్నా చేస్తున్నా ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని, రైతులను పూర్తిగా మర్చిపోయారని అన్నారు.

ఎండిన పంటకు వెంటనే నష్టం పరిహారం చెల్లించి,

కరెంట్ సక్రమంగా సరఫరా ఇచ్చి, వేసిన పంటలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై లేదా అని గుర్తు చేశారు.

7 వేల మెగా వాట్స్ నుండి 20 వేల మెగా వాట్స్ వరకు కరెంట్ పెంచింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని, ఇలాంటి విద్యుత్ కోత లేకుండా పూర్తిస్థాయిలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని అన్నారు.

ముఖ్యమంత్రి గా ఉండి రైతుల కు ఎందుకు మేలు చేయ లేక పోతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రైతుల కోసం వారి కోసం గుర్తించి పంటలు చేతికొచ్చే విధంగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన నిలబడి బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!