ఆంధ్రప్రదేశ్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్.

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ, బాధితులకు న్యాయం అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న న్యాయవాదుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, న్యాయవాదులకు రక్షణ కల్పించేలా ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని న్యాయవాది కొండ్రు కళ్యాణ్ డిమాండ్ చేశారు.విధి నిర్వహణలో ఉన్న సమయంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, ఇది నేరుగా న్యాయ వ్యవస్థ స్వేచ్ఛపై పడే ప్రభావమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీలోనూ ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, న్యాయవాదులకు ఎలాంటి భయాలు లేకుండా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాలని కోరారు. అంతేకాకుండా న్యాయవాదుల సంక్షేమం, భద్రత ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేస్తూ, ఈ చట్టం అమలు కోసం చట్టసభలలో గళం విప్పాలని ప్రజాప్రతినిధులను అభ్యర్థించారు.న్యాయవాదికి రక్షణ లేకపోతే, సామాన్యుడికి న్యాయం దక్కే మార్గంలో అడ్డంకులు ఏర్పడతాయని కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకు రావాలని ఆయన అన్నారు.న్యాయవాద వృత్తి పవిత్రతను కాపాడటానికి, వారి ప్రాణాలకు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని న్యాయవాద వర్గాలు కోరుతున్నాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!