కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
ఐదు మంది అదుపులోకి,నగదు స్వాధీనం
చట్ట విరుద్ధ కార్యాకలాపాలపై కఠిన చర్యలు.. ఎస్సై బి సాంబశివరావు*
పుల్లలచెరువు అఖండ భూమి జూలై 28 న్యూస్
పుల్లలచెరువు మండలంలోని ఎండ్రుపల్లి అడవి ప్రాంతంలో ఎర్రగొండపాలెం సిఐ కే అజయ్ కుమార్ నేతృత్వంలో ఎర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్ పులల చెరువు ఎస్సై బి సాంబశివరావు వారి సిబ్బందితో ఎండ్రపల్లి అడవి ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కోత ముక్క పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో తక్షణమే పోలీసు బృందంతో కలిసి దాడి నిర్వహించినట్లు పుల్లలచెరువు ఎస్ఐ బి సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం సీఐ కే అజయ్ కుమార్ ఎస్సై దేవకుమార్ పుల్లల చెరువు ఎస్ఐ బి సాంబశివరావు మాట్లాడుతూ, ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అందిన సమాచారం మేరకు మా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు నిర్వహించాము. అక్కడ చట్టవిరుద్ధంగా కోత ముక్క పేకాట ఆడుతున్న 5 మంది వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నాము. వారి వద్దనుంచి రూ. 25,000 నగదు స్వాధీనం చేసుకున్నాము. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



