బిగ్ బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
“కార్యకర్తే పార్టీకి అధినేత.. వారి కుటుంబాలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం” అని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటను మంత్రి నారా లోకేష్ అక్షరాలా నిజం చేసి చూపించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కిరాతకుల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ అంకితభావం గల కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది.చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక అపాయింట్‌మెంట్ లెటర్‌ను ఈరోజు తోట వీరాంజనేయులు అందుకున్నారు.
మండలిలో వైకాపా అడ్డుపడినా.. తగ్గేదేలే!
తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసేందుకు, ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చే ప్రక్రియను శాసనమండలిలో వైకాపా నేతలు అడ్డుకోవాలని చూసినప్పటికీ.. మంత్రి నారా లోకేష్ వెనక్కి తగ్గలేదు. అన్న మాట ప్రకారం చంద్రయ్య కుటుంబానికి అండగా నిలబడి, అన్ని అడ్డంకులను అధిగమించి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకానికి ఆమోద ముద్ర వేయించారు.
గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా వీరాంజనేయులు
తోట వీరాంజనేయులుకు గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) లో జూనియర్ అసిస్టెంట్ కోటాలో ఉద్యోగం లభించింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడంతో ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు నియామక పత్రాన్ని అందుకున్నారు.
కృతజ్ఞతలు తెలిపిన తోట వీరాంజనేయులు:
“మా తండ్రి గారిని కోల్పోయి అనాథలైన మా కుటుంబానికి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, ధైర్యంగా అండగా నిలిచారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం నాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి మా జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.” అని తోట వీరాంజనేయులు భావోద్వేగానికి లోనయ్యారు.
కష్టకాలంలో పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఎలా గుండెల్లో పెట్టుకుంటుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని నారా లోకేష్ మరోసారి నిరూపించారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం


