తుని ఎమ్మెల్యే యనమల దివ్య శుక్రవారం కోటనందూరు మండలం, అల్లిపూడి గ్రామంలో అంకం రెడ్డి బుల్లి బాబు ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను దత్తత తీసుకున్న అల్లిపూడి గ్రామాభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీ-2లో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజల ముంగిటకే పాలన – పెన్షన్ల పంపిణీ పర్యటనలో భాగంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలన్నదే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమకు మౌలిక వసతుల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను త్వరితగతిన మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే, స్థానిక అవసరాల కోసం అత్యాధునిక ‘కమ్యూనిటీ హాలు’ నిర్మిస్తామని, ఎస్సీల కోసం ప్రత్యేకంగా ‘స్మశాన వాటిక’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే హామీలతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అల్లిపూడి గ్రామ నేతలు అంకంరెడ్డి బుల్లిబాబు, అంకం రెడ్డి గోపి, మాజీ ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, చింతకాయల కొండబాబు, చింతకాయల సురేష్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు జనసేన నాయకులు పెదపాత్రుని శ్రీనివాస్, న్యాయవాది కొండ్రు కళ్యాణ్, చిట్టిమూరి జెమీలు, దుత్తర్తి అచ్చిరాజు, శ్రీరామ్, నెమ్మాది సత్యనారాయణ మరియు ఇతర నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్
కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు – ప్రజాప్రతినిధుల చొరవతో రామళ్లకోట వంక శుభ్రత



