విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన

పుల్లలచెరువు ఎస్సై బి సాంబశివరావు
పుల్లల చెరువ అఖండభూమి జూలై 27 న్యూస్
పుల్లలచెరువు మండలం పిడికిటి వారిపల్లి జడ్పీహెచ్ హైస్కూల్‌లో విద్యార్థుల భద్రత,సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సైబర్ భద్రత,సైబర్ వేధింపుల నివారణ,డిజిటల్ భద్రత,బాల్య వివాహాలు,టీనేజ్ గర్భధారణపై అవగాహన కార్యక్రమం పుల్లలచెరువు ఎస్ఐ బి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బి సాంబశివరావు మాట్లాడుతూవిద్యార్థులకు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం,వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం,ఓటీపీలు,పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోకూడదని వివరించారు.ఆన్‌లైన్ మోసాలు,సైబర్ వేధింపుల నుంచి రక్షించుకునే విధానాలను వివరించారు.అలాగే బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన,ఆరోగ్యపరమైన, సామాజిక సమస్యలపై,టీనేజ్ వయసులో గర్భధారణ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు,భవిష్యత్‌పై ప్రభావం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు చదువుపై దృష్టి సారించి,సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల ఎస్సై బి సాంబశివరావు వారి సిబ్బంది,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,పాల్గొన్నారు…


