లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
పుల్లల చెరువు అఖండ భూమి జూలై 28
పుల్లలచెరువు మండలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో లోకోస్ వీఓఏల మండల స్థాయి శిక్షణా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో మండలంలోని వీఓఏలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెలుగు ఎపిడి నీలకంఠ రెడ్డి మాట్లాడుతూ లోకోస్ ఈ-గవర్నెన్స్ అప్లికేషన్ వినియోగం, స్వయం సహాయక సంఘాల లావాదేవీల డిజిటలైజేషన్, సభ్యుల వివరాల నమోదు, రుణాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల పారదర్శకత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.లోకోస్ ద్వారా గ్రామీణ మహిళా సంఘాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, అన్ని రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు.వీఓఏలు యాప్‌ను సమర్థవంతంగా వినియోగించి గ్రామస్థాయిలో సంఘాలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిపిఎం లక్ష్మారెడ్డి,ఏపీఎం వెంకటయ్య, ఎల్ సి వెంకిరెడ్డి,సీసీ ఎలీషా, శ్రీను, వీఓఏలు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.



