ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 100 శాతం పూర్తి…

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 100 శాతం పూర్తి…

అభినందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల (ఈ ఎఫ్ ఎస్) ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను, సిబ్బందిని అభినందించారు.

నియోజకవర్గంలో మొత్తం 2,28,503 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,06,220 మంది (90.25 శాతం) ఈఎఫ్‌ఎస్‌ డిజిటైజేషన్ పూర్తి చేశారు. మిగిలిన 22,283 మంది (9.75 శాతం) ఓటర్లకు సంబంధించిన ఫారమ్‌లు అందుబాటులో లేకపోవడంతో “అన్‌కలెక్టెడ్ ఫార్మ్స్”గా నమోదు చేయడం ద్వారా మొత్తం 2,28,503 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను 100 శాతం పూర్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, నిర్దేశిత గడువులో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, బీఎల్‌వోలు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రక్రియలో నాణ్యతను, పారదర్శకతను కొనసాగిస్తూ భవిష్యత్‌లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!