రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడ పోటీలను ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ బోధన్ కామారెడ్డి నిజామాబాద్ అండర్ 20 సెలక్షన్స్ రాష్ట్రస్థాయి ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం కోచ్ ప్రతాప్ దాస్ మాట్లాడుతూ ప్రతి విభాగానికి 6 చొప్పున మూడు విభాగాలు ఉంటాయన్నారు. ఇండియన్ వార్, రికరువు, కాంపౌండ్ లో భాగంగా బాలికలు ఆరు బాలురు ఆరు క్రీడాకారుల చొప్పున సెలక్షన్స్ ఉంటాయన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు దేశస్థాయిలో నిర్వహించే క్రీడలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ లు రవీందర్, పీరియా నాయక్, పిన్నం రామచంద్రం, ముదాం శివ శంకర్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది ఆర్చరీ క్రీడాకారులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


