రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన PACS చైర్మన్‌గా చంద్రయ్యగారి అనంతరెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్‌తో పాటు నూతన పాలకవర్గ సభ్యులను షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ అభినందించారు.

రైతులకు అండగా PACSలు పనిచేయాలి

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితేనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా PACSలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సహకార సంఘాలు కేవలం రుణాల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి తదితర కార్యక్రమాలను అమలు చేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

కామారెడ్డి నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

దోమకొండ PACS నూతన చైర్మన్ అనంతరెడ్డిని అభినందించిన ఆయన.. రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా ప్రతి రైతుకు సమానంగా సేవలందిస్తూ PACSను మరింత బలోపేతం చేయాలని కోరారు.

జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ..

రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, కొంత ఆలస్యం జరిగినా ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ సామగ్రి సకాలంలో అందేలా PACS చైర్మన్లు, పాలకవర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు చిన్నచిన్న అవసరాల కోసం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామస్థాయిలోనే సహకార సంఘాల ద్వారా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మాజీ డీసీసీబీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, దోమకొండ సర్పంచ్ ఐరేని నరసయ్య , ఆశ పోయిన శ్రీనివాస్ ,కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, తిరుమల గౌడ్, ఇరేని సందీప్, అంతంపల్లి సుధాకర్ రెడ్డి , అబ్బర బోయిన స్వామి , రామస్వామి గౌడ్ , రెడ్డి నాయక్, భూమనీ బాలరాజ్, బల్యాల సుదర్శన్, లింగారెడ్డి, కవిత, నౌసి లాల్ నాయక్ , అంకం కృష్ణారావు, శ్రీకాంత్, రాకేష్ రెడ్డి, మండల SC సెల్ అధ్యక్షులు వినీత్, గ్రామ అధ్యక్షులు మధు, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, సిద్దారంలు, ఈశ్వర్ గౌడ్, లింగం, సాయిలు, శ్రీహరి, నరేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సంజీవ్, రామస్వామి గౌడ్, సిద్ధారెడ్డి, బాపురెడ్డి, అంజం, జగ్గారెడ్డి, ముత్తాగౌడ్, నర్సింలు, బాలరాజ్, పాత్రికేయ మిత్రులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు వివిధ సొసైటీల చైర్మన్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!