దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్);
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దోమకొండలో ఘనంగా క్రీడా పోటీలు
దోమకొండ, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ ఫోర్ట్ & విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో “ఆడుదాం దోమకొండ” కార్యక్రమంలో భాగంగా వివిధ క్రీడా పోటీలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ క్రీడా పోటీలలో భిక్కనూరు, దోమకొండ, బీబీపేట్ మూడు మండలాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు, అలాగే దోమకొండకు చెందిన యువతీ యువకులు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, క్రికెట్, రన్నింగ్, చెస్, క్యారం తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 1,244 మంది క్రీడాకారులు పాల్గొనగా, వివిధ విభాగాల్లో 444 మంది క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గిరి గారు, దోమకొండ కోట వారసులు కామినేని అనిల్ గారు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి DYSO వెంకటేశ్వర్ గౌడ్ గారు, గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య గారు,ట్రస్ట్ వైస్ చైర్మన్ బాబ్జి ప్రతినిధులు గణేష్ యాదవ్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులు, యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
“ఆడుదాం దోమకొండ” కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలను క్రీడల వైపు ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడా నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ దోమకొండ ఫోర్ట్ & విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…


