అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాం.
ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం కలుగుతుంది.అని తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్లు, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.అని షబ్బీర్ అలీ తెలిపారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది అని అన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. అని అన్నారు.
కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పథకాలను సమన్వయంతో అమలు చేయడానికి కృషి చేస్తున్నాం అని గుర్తు చేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది.అని ఎంపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల అధ్యక్షులు ఆశబోయిన శ్రీనివాస్, SC సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్, ST సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, మాజీ జడ్పీటీసీ తిరుమల్ గౌడ్, మండల SC సెల్ అధ్యక్షులు వినీత్, గ్రామ అధ్యక్షులు మధు, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, అబ్రబోయిన స్వామి, గోపాల్ రెడ్డి, సిద్దారంలు, ఈశ్వర్ గౌడ్, లింగం, సాయిలు, కవిత, శ్రీహరి, నరేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సంజీవ్, రామస్వామి గౌడ్, సిద్ధారెడ్డి, బాపురెడ్డి, అంజం, జగ్గారెడ్డి, ముత్తాగౌడ్, నర్సింలు, బాలరాజ్, పాత్రికేయ మిత్రులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


