కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులు..
సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం..
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ , ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ విజి గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 03 (అఖండ భూమి న్యూస్);
6 ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల దగా తో ప్రజలను వంచిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీ ఆర్ఎస్ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ వీజీగౌడ్ లు విమర్శించారు. వెయ్యి రోజుల దగపై పార్టీ ఆధ్వర్యంలో దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్లు ఉద్యోగాలు సాగునీటి రంగం కరెంటు నిరుద్యోగం యూరియా యాప్ ఇలా ప్రతి రంగంలో ప్రజలకు పెడుతున్న ఇబ్బందులను మోసాలను ఎండగట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల ప్రజలను బూరిడీ కొట్టించే, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు మరిచి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు ఆగస్టు నుండి ప్రమాద బీమా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయలేని చేతకాని ప్రభుత్వం అని, ప్రజలను, రైతులను మోసపూరిత మాటల హామీలను ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో షిత్తుగా ఓడించడానికి, బీ ఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీస్తూ పార్టీ ఆదేశాల మేరకు రోజుకో నిరసనను అనుసరించి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ముజీబ్ తో పాటు కౌన్సిలర్, గరిగంటి లక్ష్మీనారాయణ, ప్రభాకర్ యాదవ్ , ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు నల్లవెల్లి అశోక్, గాండ్ర మధుసూదన్ రావు,కుంచాల శేఖర్, కోడిపాక తిరుపతి గౌడ్, శ్రీనివాసరావు, కనిగంటి శారద నాగరాజ్, పాలకుర్తి శేఖర్, బో రెడ్డి నాగరాజు రెడ్డి, బుర్రి రవి, శ్రీకాంత్ , బొబ్బసాని శంకర్ ,కుంభాల రవి, మన్సూర్,జెర్సీ నర్సింలు,మామిళ్ల లక్ష్మణ్, గిరిగంటి లక్ష్మణ్,స్వప్న, పిట్ల వేణు. కృష్ణాజిరావు, మాసుల లక్ష్మీనారాయణ, పార్టీ ప్రతినిధి బలవంతరావు మాచారెడ్డి దోమకొండ బీబీపేట రాజంపేట కామారెడ్డి భిక్కనూర్ మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు పాల్గొన్నారు.


