పేదవాడికి జాగా ఉండకూడదా

బెల్లంపల్లి మే 01(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శెంషీర్ నగరుకు చెందిన పులిపాక రామకృష్ణ అను వ్యక్తి గత 20 సంవత్సరాల నుండి పిపి ల్యాండ్ లో సర్వే నంబర్ 170 చిన్న షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నాడు.ఆ భూమికి సంబంధించి రామకృష్ణకు ఎంఆర్ఓ నుండి వచ్చిన ప్రొసిడింగ్ కాపీ,అలాగే కోర్టుకి అర్జీ పెట్టుకోగ కోర్టులో ప్రాసెస్ నడుస్తుం కాపీ ఉన్నయి అయినా నన్ను కావాలనే కొంతమంది నాయకులు నన్ను చాలా ఇబ్బందుకలు గిరిచేటున్నారని
రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేసాడు.అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయా నాయకులు తమ రాజకీయ పలుకుబడులతో అధికారులకు కలిసి రామకృష్ణ పై పిర్యాదులు చేయగా అధికారులు వచ్చి నన్ను ఇబ్బందులు
పెడుతున్నారన్నారు.రామకృష్ణ శుక్రవారం మాదిగహక్కుల దండోరా నాయకులను ఆస్రాయించగా వారు వచ్చి రామకృష్ణ దగ్గర ఉన్న పత్రాలను చూసారు.అవి అధికారికంగా ఉన్న పత్రాలని పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ…రామకృష అనేవ్యక్తి దగ్గర అన్ని పత్రాలు సభబుగానే ఉన్నాయని,కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కక్షపురితంగా ఇతనిపై లేనిపోనివి అధికారులకు చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని,ఇతడిని షెడ్డు నుండి కాళీ చేపించే ప్రయత్తనాలు చేస్తున్నారని అన్నారు.తక్షణమే సంబంధిత అధికారులు త్వరగా స్పందించి రామకృష్ణను తగు న్యాయం చేయాలని మాదిగ హక్కుల దండోరా నాయకులు డిమాండ్ చేసారు…


