మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

హమాలి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

బెల్లంపల్లి మే 01(అఖండ భూమి న్యూస్): కార్మికుల రక్తం,చెమటతో నడుస్తున్న ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో

హమాలి కార్మికుల పాత్ర అమూల్యం… అపారమైనది…ఈ నేపథ్యంలో మే 1న

హమాలి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో

ఘనంగా మే డే వేడుకలు నిర్వహించబడినవి.ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు గెల్లి రాజలింగు ముఖ్య అతిథిగా హాజరై,కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…“కార్మికుడే దేశానికి వెన్నెముక”“శ్రమకు గౌరవం – కార్మికుడికి హక్కు”అనే నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.కార్మికులపై జరుగుతున్న అన్యాయాలపై గట్టిగా స్వరం వినిపిస్తూ,

తగిన వేతనాలు,భద్రత,సంక్షేమ పథకాలు కల్పించాలంటూ సంఘం డిమాండ్ చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హమాలి కార్మికులు పాల్గొని,తమ ఐక్యతను చాటిచెప్పారు.ఈ సమావేశంలో సమ్మయ్య,నాగరాజు,శంకర్,రాజ్‌కుమార్ తో పాటు హమాలి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని,తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని అయన కో్నుకున్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!