రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ;  దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్ 

రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి

దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్

 

నేడు సెప్టెంబర్ 17 సందర్బంగా జరిగిన కార్యక్రమం లో పార్టీ నాయకులు DR.అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న విగ్రహానికి పార్టీ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం తిలక్ స్టేడియo వద్ద జరిగిన నాయకుల చర్చ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ 79 సంవత్సరాల స్వతంత్ర భారతావంని లో దళిత బహుజన సమాజమే ప్రధానిoగా తెలంగాణ ప్రాంతంలో విద్రోహo నకు గురయ్యారని సామాజిక అన్యాయానికి గురయ్యారనితెలిపారు. మనువాద మాఫియా పాలనలో దళితులకు రక్షణ ఉండదని తెలిపారు దెక్కన్ తెలంగాణ లో 1948 నుండి నేటి వరకూ దళిత సమాజం అంతా విద్రోహనికి గురయ్యారని నీటికి అన్యాయం జరుగుతున్న పీడిత ప్రజలు వీరేనని అన్నారు. దోపిడీ కులాల రాజ్యాన్ని అంతం చేయాలని రాజ్యాధికారాన్ని దళిత బహుజనులు హస్త గతం చే సుకోవాలని..రాజ్యాధికారంలోరాని దళిత కులాలు.జాతులకు భవిష్యత్తు ఉండదని సామాజిక బానిసత్వం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.డాక్టర్ బి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం రాజకీయ. సామాజిక పోరాటం చేస్తున్న దళిత బహుజన పార్టీ ప్రతినిధులను చట్టసభలు అసెంబ్లీ పార్లమెంటులకు పంపించవలసిన బాధ్యత దళిత బహుజన సమాజం మీద ఉందన్నారు.

రెండు శాతం లేని బ్రాహ్మణ పటేల్ పట్వారి దేశముఖ భూస్వామ్య దోపిడీ కులాలు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు సెప్టెంబర్ 17 న రాజకీయ గ్రామాలు ఆడుతున్నారని దళితులను రాజ్యాంగంలో రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు పార్టీ పిలుపుమేరకు మన ఓటు మన రాజ్యం అనే నినాదంతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రజా చైతన్య సభలు విజయవంతం చేయాలని కృష్ణ విజ్ఞప్తి వేశారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్. అంబేద్కర్ గారి పైన అవమానకర. వ్యాఖ్యలు. అసత్య పుస్తకలు రాయడం వెనుక RSS. బీజేపీ పార్టీ ల మనువాదల హస్తం ఉన్నదని. వారిపైన రాజద్రోహం కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ యాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ను కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పులి. రాజారామ్.పార్టీ రీజనల్ ఇంచార్జ్ పి. రాజలింగం.రాష్ట్ర ఆర్గనైజషన్ కార్యదర్శి పిట్ల. ఈశ్వర్. పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ నిచ్చికోల రాంచంద్రం.జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆరెపల్లి నరేష్. జిల్లా ఉపాధ్యక్షులు దాసరి. రవికుమార్. నాయకులు చిప్పరి. కరుణాకర్. ఎ. రాజన్న. దయాకర్ పాటిల్.తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!