ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న

 

చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులందరూ కలిసి రూ.9500 నగదు ఆర్థిక సహాయం అందజేత అందజేత

యర్రగొండపాలెం అఖండ భూమి:మండలంలోని వీరభద్రాపురం ఎస్సీ కాలనీకి చెందిన ఇజ్రాయిల్,నాగమ్మ దంపతుల సంతనమైన భారతి(11),సిద్దు (13) ఇద్దరు చిన్న పిల్లలు షుగర్ వ్యాధితో బాధపడుతు నరసరావుపేటలోని లైఫ్ లైన్ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు పొందుతున్నారు.ఇశ్రాయేలు కుటుంబం కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.కటిక పేదరికంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.పిల్లలకు వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బులు లేక ఆర్థిక పరిస్థితిలో దాతల నుండి ఆర్థిక సహాయం చేయాలని కోరారు.విషయం తెలుసుకున్న చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులందరూ కలిసి రూ.9500 నగదు ఆర్థిక సహాయాన్ని పిల్లల వైద్య ఖర్చులకు పిల్లల మేనమామ మల్లికార్జునకు బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు సభ్యులు,యర్రగొండపాలెం,పుల్లలచెరువు యంఈఓలు పి ఆంజనేయులు,ఇందిరా మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని అనుసరించి తనకు చేతనైనంతలో అనాధ,వృద్ధ,వికలాంగ,నిరాశ్రయులకు సహాయ సహకారాలు అందించుటకు తమ సభ్యులు ఎప్పుడు ముందుగా ఉంటారని అన్నారు.మానవత్వం కలిగిన స్థానిక,స్థానికేతర దాతలు,స్వచ్ఛంధ సంస్థలు పిల్లలు భారతి,సిద్దుకు వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయం అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం,పుల్లలచెరువు యంఈఓ పి.ఆంజనేయులు, ఇందిరా ప్రసాద్,సభ్యులు కోటేశ్వర్లు,ఏ నాగయ్య,ఎమ్ రవీంద్రబాబు,గ్రంధిశిల కృష్ణ,షేక్ మహబూబ్ బాష,కె పిచ్చయ్య,డి శ్రీను, ఇమ్రాన్,జ్యోతి ప్రసాదరావు,బాధిత పిల్లల మేనమామ మల్లికార్జున,బాబాయి తిరుమలరావులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!