చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు

చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు

యర్రగొండపాలెం అఖండ భూమి:యర్రగొండపాలెం పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద మండలంలోని 18 పంచాయతీల పారిశుధ్య కార్మికులకు ఆధునిక సదుపాయాలతో కూడిన 40 కొత్త మూడు చక్రాల చెత్త సేకరణ రిక్షాలను మరియు 240 తడి, పొడి చెత్త సేకరణ డబ్బాలనుయర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఈ రిక్షాలలో తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించే ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల చెత్తను శాస్త్రీయంగా వర్గీకరించి, పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త నుండి సంపద సృష్టి అనే లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. తడి చెత్త ద్వారా కంపోస్ట్ తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపించడం ద్వారా ఆదాయం వస్తుంది అని పేర్కొన్నారు.పరిశుభ్రమైన యర్రగొండపాలెం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇంటి వద్ద నుంచే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వడం అలవాటు చేసుకుంటే పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. చెత్తను సరైన విధంగా నిర్వహిస్తే అది సమస్య కాదు, సంపదగా మారుతుంది.పారిశుధ్య కార్మికులు మన సమాజానికి వెన్నెముకలాంటివారు.వారి సేవలు అమూల్యం. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి పనితీరును మరింత మెరుగుపరచడం మా లక్ష్యం అని అన్నారు.అలాగే పారిశుధ్య కార్మికుల కృషిని అభినందిస్తూ, వారి సంక్షేమం మరియు పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు.అలాగే పట్టణాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి రామారావు నాయక్,మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, సెనగ నారాయణరెడ్డి,వేగినాటి శ్రీనివాస్, పెరుమాళ్ల మల్లిఖార్జున, వేగినాటి శ్రీనివాస్, కొత్త మాసు సుబ్రహ్మణ్యం, చీదేళ్ల నాగేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, కేసనపల్లి మల్లిఖార్జున, మస్తాన్ వలి, షేక్ ఇస్మాయిల్,సంబంధిత అధికారులు, పారిశుధ్య కార్మికులు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!