ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమే…

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 31 (అఖండ భూమి న్యూస్);

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కి పదవి విరమణ సహజమేనని సంగమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు పదవి విరమణ పొందడంతో ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ సహజమేనని, జీవించినంత కాలంలో ఇతర రంగాల్లో తన టాలెంట్ తో పనులు నిర్వహించుకోవచ్చు అన్నారు. ఉద్యోగానికి మాత్రమే విరమణ వర్తిస్తుందని, ఇతర రంగాల్లో రాణించడానికి ఆరోగ్యం సహకరిస్తే 100 సంవత్సరాల వరకు విరమణ ఉండదని అన్నారు. విరమణ పొందిన వారు బాధ్యత తీరిందని అనుకోకుండా ఇతర రంగాల వైపు దృశ్యం కేంద్రీకరిస్తే ఆ అద్భుత విజయాలు సాధించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగం పరిమిత కాలంలోనే పూర్తవుతుందని జీవితంలో పొడిదూడుకులను నెమర వేసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతర పనులపై దృష్టి సారిస్తే జీవితంలో తన అనుకున్న లక్ష్యం చేరవచ్చు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంతో ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి భారతదేశానికి భావి పౌరులుగా తీర్చిదిద్దిన వారి జ్ఞాపకాలను విద్యార్థులు చిరకాలంగా హృదయంలో గుర్తుంచుకుంటారని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!