గజ్యా నాయక తండా జీపీలో డి ఎల్ పి ఓ విచారణ…

గజ్యా నాయక తండా జీపీలో డి ఎల్ పి ఓ విచారణ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 31 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యా నాయక ఆండా గ్రామపంచాయతీ లో భార్య సర్పంచ్, భర్త పెత్తనం, గ్రామసభ బహిష్కరణ అఖండ భూమి న్యూస్ లో ప్రత్యేకమైనందుకు కామారెడ్డి డి ఎల్ పి ఓ శ్రీనివాస్ శుక్రవారం విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు రికార్డులను పరిశీలించారు. సర్పంచ్ రావుల వినోద నూతన చాంబర్ ఏర్పాటు చేసుకోవడంపై అభ్యంతరాలు రావడంతో ఆమెను వివరణ కోరారు. సర్పంచ్ రావుల వినోద మాట్లాడుతూ నా సొంత డబ్బులతోనే క్యాబిన్ ఏర్పాటు చేసుకున్నానని అన్నారు. గ్రామపంచాయతీలో ఒక్క రూపాయి కూడా వాడలేదని ఆమె వివరణ ఇచ్చారు. గ్రామపంచాయతీలో పలు విషయాలపై చర్చించారు. వాడు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ ల వాగ్వాదం చెలరేగడంతో అధికారులు వారిని సముదాయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ విస్తీర్ణ అధికారి, పంచాయతీ కార్యదర్శి, కామారెడ్డి సంబంధిత అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!