జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తున్న గజ్యా నాయక తాండ సర్పంచ్…
ఎన్నికైన మహిళా సర్పంచ్ పై కొందరు బెదిరింపుల..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 31.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గాజ్యా నాయక తాండ గ్రామంలో ఎన్నికైన మహిళ సర్పంచ్ రావుల వినోద పై బెదిరింపులు, అవమానకర అసభ్యకరమైన మాటల ప్రవర్తన జరిగిందన్న ఆరోపణలు విలేకరుల సమావేశంలో శుక్రవారం తెలిపారు.
గ్రామపంచాయతీ కార్యాలయంకు జిల్లా ఆఫీసర్ డిఎల్పిఓ శ్రీనివాస్ ఎంపీడీవో , ఎంపీ ఓ అధికారుల మధ్య విచారణ జరుగుతుండగా 8వ వార్డు సభ్యులు తోకల కిషన్ తనపై దురుసుగా, అసభ్యమైన పదజాలము బూతులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రవర్తించారని తనకు మరో మిగతా 2,4,5,6,7,9,10,ల వార్డు సభ్యులు కూడా వత్తాసు పలకారని సర్పంచ్ రావుల వినోద ఆరోపించారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత గౌరవం దెబ్బతిందని, ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని , లేనిపోని ఆరోపణలు చేశారని ఆమె తెలిపారు.
ఈ విషయమై కామారెడ్డి జిల్లా ఎస్పీ కి లిఖిత పూర్వక ఫిర్యాదు సమర్పిస్తానని తెలిపారు. తనను ఓర్వలేక ఇలా కక్ష సాధింపు చర్యలతో మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా తనకు రాజ్యాంగ పరిరక్షణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ ఘటనపై జాతీయ ఉమెన్ రైట్స్ ను ఆశ్రయిస్తానట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు నమోదు కాగా, సంబంధిత అధికారుల నుండి నివేదికలు కోరే అవకాశముందని సమాచారం.
జిల్లా అధికారుల ఉండగా అలా దురుసుగా ప్రవర్తించడం అసభ్య పదజాలం ఉపయోగించడం పట్ల గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధుల మధ్య ఉద్రిక్తతలు చోటు చఎల్ చేసుకోవడం జరుగుతుందన్నారు.స్థానిక ప్రజల్లో ఇలాంటి అవినీతి లేకుండా పాలన సాగిస్తేన్ , ఏదో అవినీతి జరిగినట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. మహిళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాలలో సర్పంచ్ నుండి చట్టసభల వరకు మహిళలకు పెద్దపీట వేస్తుంటే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు, టిఆర్ఎస్ వారితో చేతకట్టి అయోమయం,ఆందోళన , మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని గ్రామ ప్రజలకు నిజాలు వెల్లడించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే విధంగా గ్రామ ప్రజలకు తమ వంతు కృషి ఉంటుందని ఆమె అన్నారు. ఇలాంటి భార్గవి పోయేకాలం లేకుండా స్వచ్ఛమైన గ్రామ పాలన అందించేందుకు కృషి చేస్తుంటే, ఎలాంటి అవినీతి లేకున్న , ఈరోజు జరిగినట్లు కొందరు సృష్టిస్తున్నారని అన్నారు. మహిళా సర్పంచ్ అని దుర్భాషలవడం సరికాదు అన్నాడు. బూర్గుసలాడినటువంటి వారిపై సర్పంచ్ రావుల వినోద జాతీయ మహిళా కమిషన్ కు , ఉప సర్పంచ్ లకావత్ బిక్షపతి ఎస్టీ కమిషన్ కు బాధ్యులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


