తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి…

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి…

*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 30 (అఖండ భూమి న్యూస్);

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

వర్షాలు, వరదలపై సీఎస్ సంజయ్ జాజు, రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షాలు వరదలపై ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులంతా వారి వారి కేంద్ర కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు 24 గంటలు పని చేయాలని అన్నారు. జిల్లాల వారిగా కురిసిన వర్షాలు, డ్యాం లలో చేరిన నీరు, దెబ్బతిన్న, రోడ్లు వంతెనలు, చేపట్టిన సహాయ చర్యల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లు సమాచారం అందితే తక్షణమే స్పందించాలని వివరించారు. గ్రామీణ స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు టామ్ టామ్ చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, వైద్యారోగ్య శాఖా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నదుల పరిసర ప్రాంతాలలోనికి పశుకాపరులు, మత్స్యకారులు, ఇతరులు ఎవరు వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

డిజిపి సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, .భారీ వర్షాలు వరదల వల్ల ప్రజలు ఎవరికి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తుందని వివరించారు. పోలీసు శాఖ తరపున అవసరమైన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరం నుంచి ఈ వీసీలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. మాట్లాడుతూ.. ఆస్తి, నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలని , గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వర్షం నీరు నిలవకుండా చూడాలని , విద్యుత్ స్తంభాలు తాకవద్దని , పశువులను సురక్ష ప్రాంతాల్లో ఉంచాలని, పురాతన భవనాలలో నివసిస్తున్న వారెవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి, ట్రైనింగ్ కలెక్టర్ రవి తేజ. సీఈవో చందర్, డి ఆర్ ఓ పాండు. డిపిఓ మురళి,జిల్లా అధికారులు,

ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!