గౌరవాని మత్తడి తూము కాలువ గండిని పరిశీలించిన తహసిల్దార్,..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ సంగమేశ్వర్ మండలం గొట్టిముగ్గుల తూము గండిపడడంతో తాసిల్దారు, ఎంపీడీవో, సంగమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాస్ రావు గురువారం పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గొట్టిముక్కుల గౌరవాన్ని మత్తడి కాలువ తూము దగ్గర గండిపడడంతో కాలువ నీరు సంగమేశ్వర వరకు సమీపించడంతో ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు తో పాటు అధికారులు అప్రమత్తమై గండిని పరిశీలించారు. చెరువులోని నీరు వృధా కాకుండా గండిని పూడ్చేందుకు అధికారులు మరవత్తుల కోసం అధికారులకు సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,రైతులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


