రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి

రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి

మాజీ ఎంపీ మార్గాని భరత్ పట్ల వెటకారంగా మాట్లాడడం మానుకోవాలి

-సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వాసంశెట్టి గంగాధరరావు సూచన

రాజమహేంద్రవరం: అఖండ భూమి;
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పట్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చాలా వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ తెచ్చిన నిధులతోనే పనులు చేస్తూ ఆయన ఏదో గొప్పగా సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప ఆదిరెడ్డి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మార్గాని వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి మళ్లీ కొత్తగా శిలాఫలకాలు వేసుకున్న ఘనత కూడా మీకే దక్కిందని పేర్కొన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్సిపి సిటీ కార్యాలయంలో గురువారం వాసంశెట్టి గంగాధర్ రావు మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ప్రాచీనమైన ఉమా మార్కండేయేశ్వర దేవస్థానం ధ్వజస్తంభం ప్రతిష్టాపన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పుడు మీ వెనుక ఉన్న ఇన్నమూరి దీపు అప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నారని గుర్తు చేశారు. నూతన ధ్వజస్తంభ జీర్నోర్ధారణకు పీఠాధిపతులను పిలవకుండా ప్రతిష్టించడం సరైన విధానం కాదన్నారు. అక్కడ ధ్వజస్తంభాన్ని పట్టించుకోకపోవడం వల్లే వైసీపీ పరిస్థితి ఇలా అయిందని మాట్లాడటం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం ధ్వజస్తంభం పాడైందని చెబుతున్నారని అప్పుడు పాలకవర్గ చైర్మన్ గా పనిచేసిన ఇన్నమూరి దీపు పాలకవర్గంలో చర్చించి తీర్మానం చేసి దేవదాయ శాఖ కమిషనర్ కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.
ప్రతి ఏటా భరత్ కుటుంబంతో కలిసి అక్కడ దేవుడికి లక్ష బిల్వార్చన, నిరంతర మంత్ర పఠనం చేస్తున్న విషయం మీకు తెలియదా అని నిలదీశారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న మంత్ర పఠనం పట్ల కూడా వ్యంగంగా మాట్లాడడం సరైన విధంగా లేదని అన్నారు. నగరంలో జరిగే ప్రతి విషయాన్ని భరత్ రామ్ తో ముడిపెట్టి మాట్లాడడం ఆదిరెడ్డికి తగదన్నారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన విషయంలో కూడా రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. 60 కోట్లతో మోరంపూడి ఫ్లైఓవర్, పూలే అంబేద్కర్ భవన్, 100 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రి, గ్లో గార్డెన్స్, రివర్ ఫ్రంట్, 340 కోట్లతో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి, 270 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి ఇలా అన్ని పనులకు నిధులు తెచ్చింది అప్పటి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత చేపట్టిన ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరానికి ఏం తెచ్చారో, ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అంటే మూడు పార్టీల కలయిక అని అందరు అనుకుంటున్నారని దాని వెనక నాలుగవ ముఖం కూడా ఉందని త్వరలోనే దాని విషయాలు కూడా వెల్లడిస్తానని స్పష్టం చేశారు 450 కోట్లతో మెడికల్ కాలేజీ, దివాన్ చెరువు ఫ్లైఓవర్ టెండర్లు కూడా వైసిపి ప్రభుత్వం హయాంలోనే జరిగాయన్నది ఆదిరెడ్డికి తెలియదా అని విమర్శించారు. ఇట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, కంబాలచెరువు పార్కు అభివృద్ధి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని తెలిపారు.
తప్పులన్నీ మీరు చేస్తూ అంతా మార్గాని భరత్ రామ్ చేశారంటూ పదేపదే విమర్శలు గుప్పించడం సమంజసంగా లేదన్నారు. ఇదే సమయంలో కూటమి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి ఏం తెచ్చారో, ఏం సాధించారో కూడా చెబితే మేము బహిరంగ చర్చకు రావడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. రాజమండ్రి నగరానికి ఒక పనికిరాని ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలిచిపోతున్నారని, ముందుగా ఆయన భాష, పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. సమావేశంలో వైసిపి నాయకులు దాసి వెంకట్రావు, నల్లమిల్లి సత్తిరెడ్డి , సప్పా ఆదినారాయణ, బిల్డర్ చిన్న, రేగుళ్ల శ్రీధర్, రొక్కం త్రినాథ్ గౌరీ శంకర్, చవ్వాకుల సుబ్రమణ్యం, సేపెని మునీశ్వరరావు, నగర బోయిన శ్రీనివాస్, మురళీకృష్ణ, నాగేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!