అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …

అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …

“రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పుట్టినరోజు వేడుక పార్టి సెక్యులర్స్ , శ్రేణులు , అభిమానులు మధ్య ఎంతో ఘనంగా జరిగింది .

రాజమహేంద్రవరం; అఖండ భూమి;

“మేడా” ను గజ మాలలతో సత్కరిస్తు , దుస్సాలువాలు కప్పి గౌరవ అభిమానాన్ని చాటుకున్నారు . నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటు బాధితులకు ఒక భరోసాగా వారి సమస్యలకు “మేడా” వెన్నుదాన్నుగా ఉండటం ప్రజలు అదృష్టంగా భావిస్తారు . సమస్య ఏదైనా న్యాయం పక్షాన మేడా ఉంటాడని , ఒకసారి మేడా శ్రీనివాస్ మాట ఇస్తే బాధితుడు దైర్యంగాను, నమ్మకం గాను ఉండొచ్చునని , నమ్మకానికి ప్రతిరూపం మేడా శ్రీనివాస్ , ధైర్యానికి చిహ్నం మేడా అని అనేక ప్రాంతాల్లో ప్రజలు నమ్మకంతో ఉంటారని , సమస్య ఎంత పెద్దదైనా మేడా ను చూస్తే బాధితుడికి ఒక మొండి దైర్యం వస్తుందని అలాంటి నాయకత్వం మేడా సొంతం అని , నమ్మిన సిద్ధాంతం , ఇచ్చిన మాట మేడా కు శ్వాసగా వుంటుందని , మేడా తో స్నేహం ధైర్యానికి , నమ్మకానికి ఒక భరోసా వంటిదని , 40 ఏళ్ల మేడా రాజకీయ ప్రస్థానం లో ఎన్నడు రాజీపడలేదని , ఏలాంటి ఒత్తిడినైనా , వేధింపులు నైనా చిరునవ్వుతో తట్టుకుని ఏడురోడ్డి పోరాడటం మేడా శ్రీనివాస్ నైజం అని, మేడా నాయకత్వంలో పార్టిలో కొనసాగుతున్న సెక్యులర్స్ అందరు సంతృప్తి తోను, ఆత్మ విశ్వాసం తోను, ఆత్మ గౌరవం తోను కొనసాగటం విశిష్ట మైన విశేషం అని, ఒక 20 ఏళ్ల క్రితం ఒక ప్రధాన రాజకీయ పార్టి నుండి ఒక పదవి తన కాళ్ల ముందుకు వచ్చినా ప్రజల భవిష్యత్ కు ఏ మాత్రం ఉపయోగం లేని మీ పార్టి ఆశయాలు నా లక్ష్యాలకు సరిపడవని తృణప్రాయంగా తోసిపుచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మహోన్నత శిఖరానికి మేడా చేరుకుంటారని , భారతదేశ చరిత్రలో మేడా శ్రీనివాస్ సుస్థిర స్థానం కైవసం చేసుకుని ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప చారిత్రిక చోటు దక్కించు కుంటారని మేడా జన్మదిన వేడుకకు విచ్చేసిన వక్తలు , శ్రేణులు, పార్టి సెక్యులర్స్ మేడా శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని, ఆయన సేవలను కొనియాడారు .

 

అనంతరం మేడా శ్రీనివాస్ చేత అభిమానులు, పార్టి సెక్యులర్స్ బారి కేక్ కట్ చేయించారు . మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ నా అంతిమ జీవితం సమాజ హితం కోసం , బావి తరాల భవిష్యత్ కోసం , మానవ హక్కుల భద్రత, మెరుగైన ప్రభుత్వ పౌర సేవలు అమలు కోసం, అక్రమ కేసులకు తావులేని పటిష్ట మైన చట్ట భద్రత , న్యాయ రక్షణ , మెరుగైన సమ సమానత్వ పాలన, పేదరికం లేని జీవితాలను సాధించటమే నా జీవిత లక్ష్యం అని , నాపై అభిమానంతో వక్తలు , శ్రేణులు, పార్టి సెక్యులర్స్ నా వ్యక్తిత్వం పై ఎన్నెన్నో మంచి మాటలు చెప్పి నాలో మరింత ఉత్సాహన్ని నింపిన అందరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియచేస్తున్నాను..

 

రాజమండ్రి నగర పుర ప్రముఖులు సర్వశ్రీ గన్ని కృష్ణ , పట్టపగలు వెంకట్రావు , సాయి మల్టిస్పెషలిటీ ఎమ్. డి. విజయ కుమార్ , మార్గాని నాగేశ్వరావు , బోలిశెట్టి సత్యనారాయణ (బాక్స్ ప్రసాద్) పొలసానపల్లి హనుమంతరావు , కోడూరి శాంతరావు , కడియాల వరబాబు , గంగిన హనుమంతరావు , యాళ్ళ ప్రదీప్ , కడియాల శ్రీనివాస రావు , కోడి ప్రవీణ్ , ఆకుల బంగారుబాబు , మనే దొరబాబు, జవ్వాది మురళి , కారగాని వేణు , లక్కోజీ, నుడగల సుధ , బేతాళ శ్రీను, బేతాళ మురళి , సి టి ఆర్ ఐ బాచి , ఎన్ ఎస్ యు ఐ సందీప్ , లద్దిక మల్లేష్ , దుంగా మంగ, మీరా సురేష్ , ఆకుల రాంబాబు ,

ఎన్ ఎస్ యు ఐ బబ్లు , పండగల ప్రసాద్ యాదవ్ , కిరణ్ , శివ , శ్యామ్, కరగాని వేణు , కనకాల రవి , మార్గాని సురేష్ , ప్రముఖ న్యాయవాదులు ఇళ్ల శివ ప్రసాద్ , సురేంద్ర సింగ్ , నర్సింగ్ శ్రీనివాసరావు, వీరబద్రరావు , స్వర్ణపాప,

డి వి వి ఎస్ మూర్తి, వల్లూరి శ్రీనివాసరావు, సోమాల స్వామీజీ , యండమూరి శ్రీను , అనిశెట్టి లక్ష్మణ రావు, రంది త్రినాద్ , ఆనిశెట్టి ప్రకాష్ లు మేడా శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు .

 

మేడా శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకను పురష్కరించుకుని పండగల ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో అమ్మా , నాన్న ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పలు దాత్రుత్వ సేవలు నిర్వహించారు . అనంతరం స్థానిక కంబాల చెరువు వద్ద ముత్యాల ముత్యాల రాయుడు మిత్ర మండలి , మేడా మహా మిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు, 25 కేజీల బియ్యం బస్తాలు పంపిణీ చేసారు . అనేక ప్రాంతాల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్స్ ఆధ్వర్యంలో మేడా శ్రీనివాస్ జన్మదినం సందర్బంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .

 

ఈ కార్యక్రమంలో అర్పిసి సెక్యులర్స్ , అభిమానులు, శ్రేణులు సర్వశ్రీ పెండ్యాల కామరాజు, కాసా రాజు , డి వి రమణమూర్తి , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , సిమ్మా దుర్గారావు , కారుమూరి యుగంధర్ , కారుమూరి శిరీషా , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా తదితరులు పెద్ద సంఖ్య లో పాల్గొనియున్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!