మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన కోసం ఎన్నికల రాజకీయం పోరాటానికి సిద్ధం కావాలని ఎస్సి. ఎస్టీ. బీసీ. మైనారిటీ సమాజానికి దళిత బహుజన పార్టీ (డి బి పి) వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్ పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా ఈ నెల 29 నుండి జరిగే పాదయాత్ర. సభ లను విజయవంతం చేయాలన్నారు. ఈ విషయం పైన నేడు పాయకరావుపేట లోని పరివర్తన నిలయం లోని పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశం లో కృష్ణ స్వరూప్ పాల్గొన్నారు. రాష్ట్రం లో దళితులు పైన దాడులు జరుగుతున్న హోమ్ శాఖ నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం. ఎన్డీఏ ప్రభుత్వం పట్టించికోవటం లేదన్నారు. రాష్ట్రO లో దళితుల మానవ హక్కుల ప్రభుత్వం చే కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. దోపిడీ కుల మనువాదుల పార్టీ ల పాలన లో దళిత బహుజన ప్రజలకు రక్షణ లేదన్నారు. సోషల్ జస్టిస్ అమలు కావటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితి ల్లో రాష్ట్రo లో మెజారిటీ ప్రజలకు పొలిటికల్ పవర్ సాధన ద్వారా న్యాయం జరుతుందని.. రక్షణ. రాజ్యాంగం హక్కులు ఖచ్చితంగా అమలు కోసం వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించికోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో దళిత బహుజన సమాజం అధికారం లోకి రాకపోతే సామాజిక. రాజకీయ బానిసత్వం తప్పదని కృష్ణ స్వరూప్ ప్రకటించారు.ఈ సందర్బంగా కొన్ని డిమాoడ్ లను పరిష్కారం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం కు విజ్ఞప్తి చేసారు. ప్రతీ దళిత కుటుంబం నకు రెండు ఎకరాల భూమి ఇవ్వాలని. ఎస్సి. ఎస్టీ కేసుల మానేటరీ రాష్ట్ర కమిటీ సమావేశం సీఎం. అధ్యక్షతన తక్షణమే నిర్వహించాలని. ఎస్సి. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విడుదల చేయాలనీ బీసీ. ఎస్సి. ఎస్టీ కార్పొరేషన్ లకు నిధులు విడుదల చేయాలనీ. గాడే సాయి కృష్ణ లాకప్ డెత్ కు పాల్పడిన పోలీస్ అధికారులు పైన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్. హేటిరో కంపెనీ బ్లాస్టింగ్ బాధితులకు న్యాయం చేయాలన్నారు.ఈ సమావేశం లో పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు దువ్వాడ దావీదు. పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి. అన్నపూర్ణ. మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రామచంద్ర రావు.నాయకులు సాక. రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం


