దోమకొండ లో ఘనంగా రాహుల్ గాంధీ జయంతి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 19 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టిస్తానికి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఆయన అంకితభావంతో చేస్తున్న సేవలను గుర్తించి ఆయన అడుగుజాడల్లో నడిచి పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ ఐరన్ నరసయ్య, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అబ్రబోయిన స్వామి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, శంకర్ రెడ్డి, సీతారాం మధు ముదిరాజ్, నల్లపు శ్రీనివాస్, కదిరే గోపాల్ రెడ్డి, నర్సారెడ్డి, సంజీవరెడ్డి,షమ్మీ, పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, నేతుల సుధాకర్ యాదవ్, అబ్ర బోయిన రాజు, సంతోష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


