టి యు సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో గల యూనివర్సిటీ లైబ్రరీకి పిజి విద్యార్థులు తదుపరి ఉన్నత చదువుల కోసం,ఉద్యోగం కోసం ఆ అసరమైన (యు జి సి, ఎన్ ఈ టి, సి ఎస్ ఆర్ ఎన్ ఈ టి) పరీక్షల ఉత్తీర్ణతకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలను అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి అందజేశారు. ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ చేతులమీదుగా లైబ్రరీ అధికారి శ్రీకాంత్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ. నెట్,సెట్ కోసం చదివే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందివ్వడం గొప్ప విషయమని అన్నారు. డా.రమాదేవి విద్యార్థుల ప్రయోజనం కోసం తన సొంత జీతంలో నుంచి తీసి పుస్తకాలు కొని ఇవ్వడం చాలా అభినందించ తగ్గ విషయం అన్నారు. విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకొని పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని కోరారు.
డా.రమాదేవి మాట్లాడుతూ కొత్త సిలబస్ కు అనుగుణంగా పుస్తకాలను విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ పుస్తకాలు కొనాలంటే విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది కాబట్టి వాటిని లైబ్రరీ లో అందుబాటులో ఉంచాలని అనుకున్నామని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు వాడుకొని మరింత ఙ్ఞానాన్ని పెంచుకోవాలని,తద్వారా పోటీ పరీక్షల లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.పుస్తకాల ఏర్పాటులో సహకరించిన డా.సంతోష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, హాస్టల్ వార్డెన్ డా.సునీత,డా.అంజయ్య, ఏపీ ఆర్వో డా. సరిత పిట్ల,డా.ఎస్.నారాయణ,డా.నర్సయ్య,శ్రీకాంత్ గౌడ్,కిషన్,డా.వెంకట రెడ్డి,డా. అఫ్రీన్,డా.కనకయ్య,శ్రీనివాస్,డా.పోతన్న,డా.విజయ్ ,లైబ్రేరియన్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


