ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 03 (అఖండ భూమి న్యూస్);
ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణిలో స్వీకరించే ప్రతి వినతిని నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 80 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, ఇతర శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు), తహసీల్దార్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అందిన ప్రతి దరఖాస్తు పురోగతిని పరిశీలించి, శాఖల వారీగా బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టి, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే, చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజావాణి ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జడ్పీ సీఈవో చందర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
You may also like
టి యు సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి…
జెడి వస్తా ఫ్యాషన్ డిజైనర్ షాపును ప్రారంభించిన టిపిసిసి ప్రధాన గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి,…
షబ్బీర్అలీని కలిసిన పెద్ద మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు…
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి గ్రామ సమస్యల పట్ల వినతిపత్రం అందజేత..
రెడ్డి సంఘం గౌరవాధ్యక్షులుగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవ ఎంపిక – ఘన సన్మానం…


