టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి గ్రామ సమస్యల పట్ల వినతిపత్రం అందజేత.. 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని రాజంపేట, తడమడ్ల, ఈసాయిపేట్ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి తమ గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్డు, వాటర్, సమస్యలు, మౌలిక వసతుల లోపాలు, ఇతర ప్రజా సమస్యలను వివరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాజంపేట, తడమడ్ల, ఈసాయిపేట్ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు తమకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని, అలాంటి అభివృద్ధి తమ గ్రామాల్లో కూడా జరగాలని ఆకాంక్షించారు. ప్రజల అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి వారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


