సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
బెల్లంపల్లి మార్చి 09(అఖండ భూమి న్యూస్ ):సింగరేణి రిటైర్డ్ కార్మికులు, గ్రాడ్యుటిపై సీలింగ్ ఎత్తివేసి,20 లక్షలకు పెంచిన తర్వాత రిటైర్డ్ కార్మికులకు రావలసిన వారు పనిచేసిన కాలానికి రావలసిన సర్వీస్ (గ్రాడ్యుటి) చెల్లించాల్సి ఉండగా సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ గ్రాడ్యుటి చట్టాన్ని కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవరిస్తూ కార్మికుల్ని మనోవేదనకు ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది.ఈ సమస్యపై రామగుండం ఏఎల్సి కి, అలాగే ఆర్ఎల్సి కి సింగరేణి అనుసరిస్తున్న వైఖరిపై పలు దఫాలుగా ఫిర్యాదు చేశారు.అయినప్పటికీ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా సింగరేణి యాజమాన్య వైఖరి ఉంది. సింగరేణి నుండి రికవరీలు చేపట్టాలని కలెక్టర్ కీ కూడా కేంద్ర కార్మిక శాఖ ప్రాంతీయ అధికారి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది.సింగరేణి రిటైర్డ్ కార్మికుల పట్ల అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా సత్వరమే చర్యలు తీసుకొని తమ రిటైర్డ్ కార్మికులందరికీ రావలసిన గ్రాడ్యుటీ బకాయిలు త్వరగా తిన ఇప్పించాల్సిందిగా వేడుకుంటూ ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కలెక్టర్ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి తగు చర్యలకై సిఫారసు చేస్తామని రిటైర్డ్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.మణిరామ్ సింగ్, సారు. మురళీధర్,కోడి వెంకటేశం,
నామని వెంకటస్వామి,గూడెల్లి రాజయ్య,ఏ.శంకరయ్య,కొరపాటి గురవయ్య,మాయ మల్లయ్య, గుగులోత్,సరియా,పిట్టల నరసయ్య, గాజుల రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు…
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం



