హోలీ వేడుకల్లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ స్థానిక నాయకులు,యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పురుషులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, రవి, రామచంద్రం రాజు, బాలరాజు, నాని, ముదాం రవి, తదితరులు పాల్గొన్నారు.


