ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యార్థుల సమస్యలే
– పోరాటానికి టిఎస్ యుటిఎఫ్ సిద్దం
– టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, 02 (అఖండ భూమి న్యూస్);
ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగానికి సంబంధించినవేనని, ఉపాధ్యాయులు సంతృప్తిగా పనిచేయాలంటే సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ముఖ్యమంత్రి చెప్పినట్లు విద్యారంగ సమస్యలపై ఐక్యంగా కొట్లాడాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. హేతుబద్ధీకరణ జిఒ 25 ను హేతుబద్ధంగా సవరించాలని డిమాండ్ చేశారు. ఈ జీవో విద్యారంగానికి మరణ శాసనం లాంటిదని అన్నారు. సర్వీసు నిబంధనల సంక్షోభం పరిష్కారానికి చొరవ చూపాలని, డిఈఓ, డిప్యూటీ ఇఒ, ఎంఈఒ పోస్టులను మంజూరు చేయాలని, వాటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని, ఆగస్టు 15 లోగా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పిఆర్సీ అమలు గడువు ముగిసి మూడేళ్ళు అవుతున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. ఆరు వాయిదాల కరువుభత్యం విడుదల చేయాలని, పెండింగ్ బిల్లుల విడుదలలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని అన్ని హాస్పిటల్స్ లో సమర్థవంతంగా అమలు చేయటానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ పాఠశాల ప్రారంభోత్సవాలకు హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిపై 1,80,000, ఖర్చు పెడుతున్నామని మరొక మారు ప్రతి సంవత్సరం 80,000 రూపాయల ఖర్చు పెడుతున్నామని వివిధ వేదికలలో వివిధ రకాలుగా తెలపడం శోచనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7 శాతం లోపు బడ్జెట్ కేటాయించడం వలన ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అనడం విడ్డూరం అని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ఊతం ఇచ్చే విధంగా ఉందని విమర్శించారు.నూతన విద్యా విధానం 2020 ని అమలు చేయడం వలన దేశవ్యాప్తంగా ఇప్పటికి 93 వేల పాఠశాలలో మూతపడ్డాయి అన్నారు. భవిష్యత్తులో నూతన విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే మరిన్ని పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని అన్నారు.జిఒ 317 బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందని, తాత్కాలిక ఉపశమనంగా ఇచ్చిన జిఒ 190 అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సిపిఎస్ రద్దు చేయాలని, గురుకులాలు, కెజిబివి, మోడల్ స్కూల్స్,గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని గురుకులాల మాదిరిగా మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల టైం టేబుల్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల టెట్ నిర్వహణకు సంబంధించి రెండు సూచనలు ఇచ్చారు. ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్నటువంటి టెట్ కు సంబంధించి ఎన్సిటీఈ అనుమతి తో సబ్జెక్ట్ ల వారిగా ప్రత్యేకంగా టెట్ ను నిర్వహించాలన్నారు. సర్వీస్ లో ఉన్న టీచర్లకు సర్వీస్ వెయిటేజ్ తో టెట్ కు మార్కులను కలపాలని సూచించారు.2009 విద్యా హక్కు చట్టం అమలు కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23 ను సవరించి పార్లమెంటు లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సంబంధించి హైకోర్టులో వేసినటువంటి లీవ్ పిటిషన్ ను వెంటనే వెనక్కి తీసుకొని పాత పెన్షన్ అమలు చేయాలి డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డిఎ ల పై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకొనకపోతే రాష్ట్రంలో ఉపాధ్యాయలను ,ఉద్యోగులను ఏకం చేసి దశల వారి పోరాటాన్ని ఉదృతం చేస్తామని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. విద్య, ఉపాధ్యాయ రంగానికి సంబంధించి పలు అంశాలపై పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గ భవాని, ఎం. రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి టీ లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వి . శాంతి కుమారి,డి. సత్యానంద్, ఎస్.మల్లారెడ్డి, బి. రాజు, కె. రంజిత్ కుమార్, ఎస్. రవి ప్రసాద్ గౌడ్, కె. రవి కుమార్, జి. శ్రీధర్, ఎ. సింహాచలం, వై. జ్ఞాన మంజరి, ఎం. వెంకటప్ప, పి వెంకటేశ్వర్లు, జే . యాకయ్య, సీనియర్ నాయకులు పి.మాణిక్ రెడ్డి, ఎన్. కిష్టయ్య, ఎస్ వై కొండల్ రావు, మస్తాన్ రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆకుల బాబు, సాయిలు 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
You may also like
రెడ్డి సంఘం గౌరవాధ్యక్షులుగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవ ఎంపిక – ఘన సన్మానం…
మహంకాళి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన మహమ్మద్ ఇలియాస్…
బోనాల ఉత్సవాలను ప్రజలంతా సంతోషంతో జరుపుకోవాలి…
బాధిక కుటుంబాలను పరామర్శించిన డైనమిక్ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి…
ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…


