కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!

భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!

కాకినాడ. స్వామినగర్‌లో నర్సు ప్రమీల (23) అనుమానాస్పద మృతి వెనుక ఇంటి యజమాని కుమారుడు భరత్ నందన్ నడిపిన ప్రేమ వ్యవహారం,  ప్రేమ వంచన వ్యవహారమే ప్రధాన కారణమని, ఇది ముమ్మాటికీ పథకం ప్రకారం జరిగిన ప్లాన్డ్ హత్యేనని బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరత్ నందన్‌తో ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఘటన జరిగిన గదిలో సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని బట్టి అక్కడ తీవ్ర ఘర్షణ జరిగిందని, బంధువులు రాకముందే మృతదేహాన్ని అత్యంత వేగంగా తరలించడం వెనుక భరత్ నందన్ కుట్రను దాచే ప్రయత్నం జరిగిందని వారు బలంగా ఆరోపిస్తున్నారు. దీనిని కేవలం ఒక సెల్ఫీ వీడియో ఆధారంగా సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ అసలు నిజం భరత్ నందన్ చేసిన మోసమేనని మండిపడుతూ బంధువులు న్యాయం కోసం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన భరత్ నందన్‌ను , అతని తండ్రి ని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చేయాలని బంధువులు డిమాండ్ చేశారు, దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!