
కోటనందూరు మండలం: అల్లిపూడి, ఎస్సీ కాలనీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండటంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోని మౌలిక వసతుల సమస్యలను తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తుండటంపై అల్లిపూడి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త కొండ్రు రమణమ్మ గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా కొండ్రు రమణమ్మ గారు మాట్లాడుతూ”మా అల్లిపూడి గ్రామానికి స్వాతంత్రోద్యమ కాలం నుంచీ ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, అయితే దశాబ్దాలు గడిచినా గ్రామంలోని ఎస్సీ కాలనీలో సరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ (మురుగు కాలువలు) వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఇక్కడ ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారనీ. గత పాలకులు ఎవరూ మా బాధలను పట్టించుకోలేదనీ ఆమె అన్నారు. కానీ మన ప్రజాప్రియ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మా కాలనీలో స్థితిగతులను, ఇక్కడి ప్రజల ఇబ్బందులను స్వయంగా గుర్తించారని. అంతేకాకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించి, మా కాలనీని ప్రగతి పథంలోకి తీసుకువెళ్తున్నారనీ ఆమె తెలిపారు. స్థానిక నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు గారి కృషితో ఐదవ విడతలో మరల గ్రామానికి 30 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసి అందులో 20 లక్షల రూపాయలను ఎస్సీ కాలనీకే కేటాయించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి పట్ల ఎమ్మెల్యే గారు చూపుతున్న తపన, నిబద్ధత నిజంగా అభినందనీయం అని ఆమె అన్నారు. ప్రజా సమస్యల పట్ల ఇంత వేగంగా స్పందించే నాయకురాలు దొరకడం మా అల్లిపూడి ప్రజల అదృష్టం అంటూ ఆమె ఆనందం వ్యక్తపరిచారు.
You may also like
ఆంధ్రప్రదేశ్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్.
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి


