అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు

 

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన దళిత మహిళ జల్లు రాజేశ్వరిని కులం పేరుతో దూషించి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా మాలమహానాడు అధ్యక్షులు తట్ట శ్రీనివాస రావు తీవ్రస్థ ధ్వజమెత్తారు; బాధితురాలు గొలుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందించి మూడు రోజులు గడుస్తున్నా, స్థానిక పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అత్యంత దుర్మార్గమని, లలితా కుమారి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ పోలీసులు నిబంధనలను గాలికొదిలి కాలయాపన చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ద్వారా దళితులకు రక్షణ కల్పించాల్సిన యంత్రాంగమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిందితులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని బాధితురాలికి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టబద్ధమైన న్యాయం చేకూర్చాలని, లేనియెడల మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని తట్ట శ్రీనివాస రావు గట్టిగా డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!