ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
కాకినాడ జిల్లా..
రౌతులపూడి మండలం ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన చైర్మన్‌గా కాపారపు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ కమిటీ మరియు స్థానిక ప్రముఖులు ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు.విద్యారంగంపై ప్రత్యేక పట్టు కలిగి, సమాజ సేవలో ముందుండే కాపారపు శ్రీనివాస్ ఈ బాధ్యతలు స్వీకరించడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కాపారపు అనిల్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతులు మరియు నాణ్యమైన విద్యను అందించడానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని తెలిపారు. పాఠశాల ప్రగతి కోసం అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కాపారపు శ్రీనివాస్ కు పలువురు రాజకీయ నాయకులు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం


