ఘనంగా స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

ఘనంగా స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

యర్రగొండపాలెం అఖండ భూమి: రంజాన్ మాసం సందర్భంగా సోమవారం యర్రగొండపాలెం పట్టణంలోని ఆర్ & బి బంగ్లా అతిథి గృహంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు హిందూ,ముస్లిం,క్రిస్టియన్ లకు కులాలకు అతీతంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు పి ఆంజనేయులు, మల్లు నాయక్,యర్రగొండపాలెం ఏరియా వైద్యశాల సూపర్డెంట్ దేవర యాదిద్యా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ ఇస్తారు విందులో దాదాపుగా 100 మంది పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోస్తాంధ్ర స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా చాంద్ బాషా, కోస్తాంధ్ర పి ఆర్ మీడియా కార్యదర్శి రియాజ్,మార్కాపురం జిల్లా అధ్యక్షులు సఫిఉల్లా ఖాన్,జమాత్ ఏ ఇస్లామి హింద్, పట్టణ అధ్యక్షులు

రసూల్,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ బాజీ,ఇర్ఫాన్,

వీరా చారి,కృష్ణ,స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!