ప్రయాణికులకు ఉచిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు

ప్రయాణికులకు ఉచిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు

 

చాపలమడుగు గ్రామ పంచాయతీ సర్పంచి తమ్మినేని సత్యనారాయణ రెడ్డి సహకారంతో

యర్రగొండపాలెం అఖండ భూమి:

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో దాత యస్ఎమ్ఆర్ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్,పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీ సర్పంచి తమ్మినేని సత్యనారాయణ రెడ్డి సహకారంతో రోజుకు 20 మంచినీటి క్యానులు సరఫరా చేసి ప్రయాణికులకు ఉచిత మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.సోమవారం డిఎం లావణ్య మంచినీటి కూలింగ్ బాక్స్ ను దాతలతో కలిసి ప్రారంభించారు.దింతో వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తి తీరుతుంది.అనంతరం బస్టాండ్ ఆవరణను పరిశీలించారు.పరిసరాలను పరిశుభ్రం చేయించారు.ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.ఎవరైనా అనుమతులు లేకుండా ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి షాపులు ఏర్పాటు చేయడం,ప్రైవేటు వాహనాలు నిలపటం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆమె వెంట అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మి,సిబ్బంది వెంకటేశ్వర్లు,భాస్కర్ రెడ్డి,సంజీవ రావు,దాతలు పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!