కామారెడ్డిలో 46 & 47 వార్డుల్లో ఎస్ ఐ ఆర్ ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 46, 47 వార్డులలో ఎస్ఐఆర్ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ రవితేజ, తహసిల్దార్ హిమబిందు స్థానిక కౌన్సిలర్ లు గిరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణలు మంగళవారం పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ఫారం ఇవ్వమని వారు ఒకటో తేదీ లోపు అధికారులకు ఇవ్వాలని సూచించారు. అర్వత కలిగిన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పూర్తిస్థాయి నివేదికలతో పొందపరిచి పారాలను స్థానిక బిఎల్ఓ లకు అందించాలని సూచించారు. అనంతరం బిఎల్ఓ లను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటరు ఇచ్చిన ఎస్ఐఆర్ వారంలోను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ఐ ప్రసన్న, రెవెన్యూ జిపిఓ సూరజ్, నితీష్, బి ఎల్ వో లు కాశీరాం, వెంకటలక్ష్మి, రేఖ, భవిత, జమున తదితరులు పాల్గొన్నారు.


