రైతులుnప్రత్యామ్నాయ పంటల సాగు, జల సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి…

రైతులుnప్రత్యామ్నాయ పంటల సాగు, జల సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి…

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 28 (అఖండ భూమి న్యూస్);

రైతుల ఆదాయాన్ని పెంచడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా 100 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని ప్రతి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతోంది అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తూ వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతోంది అన్నారు.

రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , కమిషనర్ అండ్ అగ్రికల్చర్ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కామారెడ్డి జిల్లా దోమకొండ రైతు వేదికలో వరి ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది కూడా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని శాస్త్రీయ అంచనాలు సూచిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే లాభసాటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

వరి పంట అధిక నీటి వినియోగంతో కూడుకున్నందున వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల పెసర్లు, కందులు, మినుములు, నూనెగింజల పంటలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయంతో పాటు పంట భద్రతను కూడా పొందవచ్చని పేర్కొన్నారు.

జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి గ్రామంలో రైతులు, ప్రజాప్రతినిధులు నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలను పునరుద్ధరించవచ్చని తెలిపారు.

ప్రతి గ్రామ పంచాయతీ, మండలానికి పంట కుంటల నిర్మాణ లక్ష్యాలు నిర్దేశించామని, రైతులు తమ పొలాల్లో సుమారు 12×12 మీటర్ల విస్తీర్ణంలో పంట కుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపికైన ముగ్గురు ఉత్తమ రైతులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈఓలు) కూడా శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఇతర రైతుల్లో అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించిన రైతులను, కార్యక్రమంలో పాల్గొన్న కవులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!